Thursday, December 12, 2024

Breaking | బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య

త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈరోజు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్యసభ ఎంపీ ర్యాగ కృష్ణయ్య (R Krishnaiah), హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను కేంద్రం ప్రకటించింది.

కాగా గతంలో ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజేర్వేషన్లు, స్కాలర్ షిప్‌లపై ఆయన ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆయనకు తిరిగి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement