Wednesday, December 25, 2024

TTD | శ్రీ‌వారి భ‌క్తుల‌కు మ‌రింత నాణ్య‌మైన సేవ‌లు….

  • స్విమ్స్‌కు జాతీయ హోదా కోసం సిఫార్సు
  • ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు
  • సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల‌ నియామకం

తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీటీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.

- Advertisement -

ఇందులో ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి…

•⁠ ⁠సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తులను గ్లోబల్‌గా విస్తరించేందుకు అవసరమైన సూచనల కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం. అదేవిధంగా దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

•⁠ ⁠స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చేందుకు ఆమోదం తెలిపారు. అదే విధంగా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు.

⁠•⁠ తిరుమలలో పెద్ద, జనతా క్యాంటీన్ల నిర్వహణలో కొత్త విధానం అమలు, మరింత నాణ్యమైన ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ కంపెనీలకు క్యాంటీన్ నిర్వహణ లైసెన్సుల జారీకి ఆమోదం. ⁠అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు SLSMPC ద్వారా వివిధ విభాగాల్లో 258 మంది సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ఆమోదం.

•⁠ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల ఆరోగ్యం కోసం ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీలో ఆహార భద్రతా విభాగం ఏర్పాటు, తదనుగుణంగా SLSMPC కార్పొరేషన్ ద్వారా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయడానికి ఆమోదం. సర్వ దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం ఆళ్వార్ ట్యాంక్ విశ్రాంతి గృహాల నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో రూ.3.36 కోట్లతో 6 మరుగుదొడ్ల బ్లాకుల నిర్మాణానికి ఆమోదం.

⁠•⁠ ఒంటి మిట్ట కోదండ రాముని ఆలయంలో విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ⁠కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న సంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి రూ.2 కోట్ల ఆర్థిక సహాయానికి ఆమోదం. ⁠ముంబైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం స్థానిక సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల భూమికి రూ.20 కోట్ల కంటే ఎక్కువ లీజు ధరను తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.

ఈ స‌మావేశంలో అద‌న‌పు ఈవో సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవోలు గౌత‌మి, వీర‌బ్ర‌హ్మం, సివిఏస్వో శ్రీధర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement