డిజిటల్ ఇండియాగా మారుతున్న దిశగా దేశంలో ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్‌లను ప్రతి ఒక్కరి చేతిలో ఉండటం చూస్తూనే ఉన్నాం. కొత్త కొత్త యాప్ లతొ అప్ డెట్లతో ఎంతోముందుకు సాగిపొతుంది ఇండియా. స్మార్ట్‌ఫోన్‌లతో ఎంతో స్మార్ట్గ్ గా పేమెంట్స్ చేయడం కూడా జనాలు అలవాటు చేసుకున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్‌లు, వాటి వినియోగం వంటి వివరాలు అందరికీ తెలిసిపోయింది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని వాడకం పెరిగుతోంది. దాదాపు అన్ని షాపుల వద్ద డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం ఉంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. గంగిరెద్దులాడించే వారు ఆ ఎద్దుపై క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను అమర్చారు. దీంతో ఒకరు దాన్ని స్కాన్ చేసి గంగిరెద్దులాడించే వ్యక్తికి డబ్బు సెండ్ చేశారు.
ఇది గంగిరెద్దులాట రికార్డెడ్ వీడియో అని, అందులో వారు క్యూఆర్ కోడ్‌ల ద్వారా భిక్ష తీసుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశం డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరిందని ఆమె కొనియాడారు.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.