Saturday, November 23, 2024

Breaking: తిరుమ‌ల ఘాట్ రోడ్‌లో కొండ‌చిలువ‌.. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగ‌బ‌డ్డ భ‌క్తులు

తిరుమల ఘాట్ రోడ్ లో కొండ చిలువ క‌నిపించింది. రోడ్డుదాటుతూ చాలాసేపు రోడ్డుపైనే ఉండిపోయింది. ఇది చూసిన వాహ‌న‌దారులు పొటోలు, వీడియోలు తీయ‌డానికి ఎగ‌బ‌డ్డారు. తిరుమల దిగువ మార్గంలో ఏడో మైలు రాయి వద్ద రోడ్డుపై కొండచిలువ రోడ్డు దాటే వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వాహన దారులు ప్రయాణిస్తున్న బ‌స్సు ఆపి మ‌రి చాలామంది ఫొటోలు తీసుకున్నారు. కొండ చిలువ సుమారు పది అడుగుల పొడవు ఉంటుంది అని భక్తులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement