Wednesday, December 18, 2024

P.V.Sindhu | నా పెళ్లికి రండి.. పవన్‌ను ఆహ్వానించిన సింధు

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, డబుల్ ఒలింపిక్ విజేత పీవీ సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింధు… తన పెళ్లికి రావాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ ను ఆహ్వానించారు. ఈ మేర‌కు ఆహ్వానపత్రిక అందించారు.

కాగా, ఈ నెల 22న సింధు పెళ్లిపీటలెక్కబోతుంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో కలిసి ఉదయపూర్ వేదికగా ఏడడుగులు వేయనుంది. దీంతో ఇరువురి కుటుంబాలు పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement