Tuesday, December 3, 2024

AP | బ్యాడ్మింటన్ అకాడమీకి పీవీ సింధు భూమిపూజ

  • విశాఖ పెద‌గ‌దిలి కూడ‌లి స్థ‌లం కేటాయింపు
  • ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం


విశాఖపట్నం: బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. విశాఖపట్నంలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భూమిపూజ చేశారు.

పనులు త్వరగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇక్కడ సుమారు మూడెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కేటాయించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement