Friday, November 22, 2024

BHEL అభివృద్ధి పనులను పరిశీలించిన పురందేశ్వరి

పామర్రు( కృష్ణాజిల్లా)- ప్రభ న్యూస్ కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే అభివృద్ధి పనులను తన పర్యటనలో భాగంగా సందర్శిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.350 వ్యయంతో నిర్మిస్తున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్( బెల్) విస్తరణ పనులను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ యుద్ధ రంగంలో అవసరమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమ యూనిట్ బెల్ కంపెనీ నిమ్మకూరులో విస్తరించినట్లు తెలిపారు. రక్షణ రంగంలో ఉపయోగించే అత్యాధునిక పరికరాలను ఇక్కడ తయారు చేస్తారని చెప్పారు. శత్రువుల ఉనికిని కనిపెట్టే అత్యాధునికమైన పరికరాలను ఉత్పత్తి చేస్తారని చెప్పారు. ఈ నిర్మాణ పనులు 2021 నాటికి పూర్తి కావలసి ఉండగా, కరోనా వల్ల జాప్యం జరిగిందని వెల్లడించారు. జనవరి చివరివారం లోగాని, ఫిబ్రవరిలో గాని పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement