Saturday, November 16, 2024

AP BJP: పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీడీపీ-జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుండగా బీజేపీ సైతం ఈ కూటమిలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సైతం భేటీ అయ్యి పొత్తులపై చర్చించారు. చంద్రబాబు పొత్తులపై చర్చించి దాదాపు 20 రోజులు దాటినా.. మూడు పార్టీల అలయన్స్‌పై ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ-జనసేన కూటమితో పొత్తుపై బీజేపీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన పార్టీలతో పొత్తుపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని ఆమె తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ పొత్తులపై ఎలాంటి క్లారిటీ లేదని తెలిపారు. పొత్తులపై హై కమాండ్ నుండి ఫైనల్ డెసిషన్ వచ్చే వరకూ 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సెగ్మెంట్లపై త‌మ దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఇవాళ ఏపీ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement