బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి టీడీపీ నేత నారా లోకేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి నాయకత్వం వహించబోయేది నారా లేకేశే అంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో… టీడీపీని నడిపించే సామర్థ్యం లోకేశ్ కు ఉందా? లోకేశ్ పెద్దమ్మగా మీరు ఏమి చెపుతారు? అంటూ ఓ మీడియా చానల్ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. లోకేశ్ తల్లి భువనేశ్వరి సోదరిగా తన ఆశీర్వాదాలు లోకేశ్ కి ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ఆయన సొంత లక్ష్యాలను. మార్గాన్ని ఆయన నిర్దేశించుకోవచ్చన్నారు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేశ్ చెంచురామ్ ఇద్దరూ వైసీపీలో లేరని పురంధేశ్వరి స్పష్టం చేశారు. తన కుమారుడు హితేశ్ పుట్టుకతోనే అమెరికా పౌరుడని చెప్పారు. యూఎస్ సిటిజెన్ షిప్ ను వదులుకునే ప్రక్రియలో జాప్యం జరిగిందని… అందువల్ల గత ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలనే ఒత్తిడి తన భర్త వెంకటేశ్వరరావుపై పడిందని, అందుకే ఆయన పోటీ చేశారని చెప్పారు. కుటుంబంలో ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలనే భావన తన భర్తదని అన్నారు. తన భర్త, కుమారుడు ఇద్దరూ వైసీపీలో లేరనేది చాలా స్పష్టమైన విషయమని చెప్పారు. తాము వేర్వేరు పార్టీల్లో ఉండటం సమంజసం కాదని ఆయన అభిప్రాయమని… అందువల్ల ఆయన వైసీపీకి దూరం జరిగారని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement