Saturday, November 23, 2024

రాగి చెంబుతో రైస్ పుల్లింగ్.. కోట్లలో లాభం.. మాయ‌మాట‌లు చెప్పే మోసగాళ్ల‌ అరెస్ట్..

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): రాగి చెంబుకు అతీత శక్తులున్నాయని.. జాతీయ మార్కెట్ లో కోట్ల విలువ చేస్తుందని న‌మ్మ‌బ‌లుకుతూ మోసగించిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఈస్ట్ డి..ఎస్..పి మురళి కృష్ణ శనివారం తెలిపారు.. ఈ సందర్భంగా అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల‌ సమావేశంలో డి.ఎస్.పి మాట్లాడుతూ.. నగరంలోని సుబ్బారెడ్డి నగర్ ఒకటవ క్రాస్ వద్ద నలుగురు వ్య‌క్తులు పోలీసులు చూసి పారిపోతుండగా పట్టుకున్నాం. వారిని విచారించగా నలుపు రంగు కలిగిన ఒక చెంబును వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాం. దీని గురించి వివరాలు సేకరించడంతో వారి మోసం బ‌య‌ట‌ప‌డింది. కొన్ని లోహాలతో తయారు చేయబడినద‌ని, ఇది చాలా విలువైనదని చెప్పి తక్కువ రేటుకు అమ్ముతున్నామని అమాయక ప్రజలను మోసగించి ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అలవాటుపడిన వారిని అరెస్టు చేశాం అని వివరించారు.

గుంటూరు జిల్లాకు చెందిన బాధితుడు షేక్ యాసీన్ త‌న‌ను నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు చేశాడ‌ని డి.ఎస్.పి తెలియజేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల‌ కోసం వెతుకుతుండగా సుబ్బారెడ్డి నగర్ లో వారు ప‌ట్టుబ‌డ్డ‌ట్టు తెలిపారు. వారిలో చిత్తూరు జిల్లా మదనపల్లి దేవాలయం వీధికి చెందిన బండారి హేమంత్ కుమార్ (48), సుబ్బారెడ్డి నగర్ కు చెందిన జి.మనోజ్ కుమార్ (34), ఎర్ర మిట్టకు చెందిన ఆర్కాట్ విజయ్ కుమార్ (44), ఎస్.ఎం.పురంకు చెందిన బిర్లా నాగరాజు (34) ఉన్నార‌న్నారు. వీరిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 1.54లక్షల నగదుతో పాటు. నలుపు రంగు కలిగిన మాక్స్ క్యాబ్ స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు. ఇందులో నిందితుడు హేమంత్ కుమార్ ఈ చెంబు తయారు చేయు విధానాన్ని యూట్యూబ్ యాప్ ద్వారా తెలుసుకుని దీనికి రెడ్ సల్ఫర్ రసాయన పదార్థాలతో తయారుచేశాడ‌ని, దానిని అమాయక ప్రజలకు చూపించి మోసానికి పాల్పడవచ్చని తక్కువ వ్యవధిలోనే డబ్బులు సంపాదించే ఆశతో మోసాలకు పాల్పడడం జరిగిందని తెలిపారు.

ఈ చెంబు టార్చ్ లైట్ వెలుగులో మెరిసి ఆరి పోతుందని.. చాలా శక్తివంతమైనదని, విలువైనదని చెబుతూ మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నార‌ని డీఎస్పీ తెలిపారు. ఇట్లాగే గుంటూరు జిల్లాకు చెందిన బాధితుడు యాసీన్ ను నమ్మించి మోసం చేయడం జరిగింది. నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన అలిపిరి సీఐ. దేవేంద్ర కుమార్, ఎస్. ఐ. జయచంద్ర, సిబ్బంది ప్రసాద్, లాల్ ఖాన్, లక్ష్మణ్ రావును అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement