Thursday, November 21, 2024

AP : పులివెందులే నా ప్రాణం… విజేత‌లు ఎవ‌రో తేల్చేది ప్ర‌జ‌లే.. సీఎం జ‌గ‌న్

పులివెందులే నా ప్రాణమ‌ని, విజేత‌లు ఎవ‌రో తేల్చేది ప్ర‌జ‌లేన‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. ఇవాళ పులివెందుల‌లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సీఎస్ఐ గ్రౌండ్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు.

- Advertisement -

పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్‌ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్‌. వైఎస్సార్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ అంటూ తెలిపారు.

కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్‌ వల్లే ఈ అభివృద్ధి పరుగుల‌న్నారు. పులివెందుల కల్చర్‌, కడప కల్చర్‌, రాయలసీమ కల్చర్‌ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్‌. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది పులివెందుల బిడ్డేన‌ని వెల్ల‌డించారు.

వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?. వైఎస్సార్‌ పేరును ఛార్జిషీట్‌లో పేర్కొంది ఎవరు?. వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్‌సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్‌ వారసులా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్‌ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారంటూ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement