Thursday, December 5, 2024

Breaking News | PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా…

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ జరగాల్సిన పీఎస్ఎల్వీ-సీ-59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఈ రాకెట్ ప్రయోగం ఈరోజు సాయంత్రం 4గంటలకు జరగాల్సి ఉంది. ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. సూర్యకిరణాలను అధ్యయనం చేసేందుకు ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి ఉంది. అయితే ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో కౌంట్ డౌన్ నిలిపివేశారు. ఈ సమస్యను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తించి సమాచారాన్ని ఇస్రోకు అందజేసింది. దీంతో తాత్కాళికంగా ప్రయోగాన్ని నిలిపివేవారు.

ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించి రేపు సాయంత్రం 4గంటలకు తిరిగి ఈ రాకెట్ ప్రయోగం నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement