శ్రీహరికోట – మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. చంద్రయాన్-3తో చందమామపై ఉన్న రహస్యాలను ఛేదించే పనిలోపడిపోయిన ఇస్రో.. మరోవైపు సూర్యుడిపై సైతం ఫోకస్ పెట్టింది.. దీనికోసం PSLVC-57 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.. ఆదిత్య ఎల్ 1 పేరుతో నిర్వహిస్తున్న PSLVC-57 రాకెట్ ప్రయోగానికి ఈ రోజు కౌంట్‌డౌన్ ప్రారంభించింది. 24 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం రేపు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు… ప్రయోగానికి సంబంధించిన ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ కేంద్రం నుంచి షార్‌కు తీసుకొచ్చి క్లీన్ రూమ్‌లో ఉంచి పలు కీలక పరీక్షలు నిర్వహించారు. సుమా రు 1475కిలోల బరువు కలిగిన ఆదిత్య- ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ- సీ 57 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇందులోని పేలోడ్‌ల బరువు 244 కిలోలు కాగా.. మిగిలిన 1,231 కిలోలు ఉపగ్రహాన్ని సూర్యుడివైపు తీసుకెళ్లడా నికి అవసరమైన ద్రవ ఇంధనంతో నింపి ఉంటు-ంది. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ పాయింట్-1(ఎల్-1)లోకి పంపడానికి 109 నుంచి 177 రోజులు పడుతోంది.
అక్కడి నుంచి గ్రహణాలు తదితర అవరోధాలేవీ లేకుండా సూర్యుడిపై జరిగే మార్పు లను నిరంతరం పరిశోధిం చేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఉపగ్రహంలో ఆరు పేలోడ్‌లు అమర్చి పంపుతున్నారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు సూర్యుడి కరోనా విస్తరించి ఉంటుంది. ఈ కరోనాలో ఉష్ణో గ్రత దాదాపు 10 లక్షల డిగ్రీల కెల్విన్ డిగ్రీలు ఉంటు-ందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత 6 వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటు-ందంటు-న్నారు. కరోనాలో వేడి విపరీతంగా పెరిగిపోతుండడానికి కారణం శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు . ఇక నేడు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 24గంటలు ముగిసిన అనంతరం శనివారం ఉదయం 11. 50 గంటలకుఆదిత్య-ఎల్1 రోదసిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా సౌరగోళంలో గాలులు, జ్వాలలపై పరిశోధ నలు నిర్వహించనుంది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని రోదసి లోకి పంపి సౌర కరోనాతో పాటు- సూర్యుడి నుంచి ప్రసరించే అతి శక్తిమంతమైన కాంతి కిరణాల ప్రభావం, సౌర మండలంలోని గాలులపైనా అధ్యయనం చేయనున్నారు. సౌర తుఫాన్ల సమయంలో వెలువడే రేణువులతో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు గతంలోనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో రేణువులతో పాటు- కాంతి మండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై ఆదిత్య ఎల్-1తో అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించనున్నారు.
ఇదిఇలా ఉంటే ..ఆదిత్య ఎల్ 1 నమూనాతో ఇస్రో ఛైర్మన్, ఇతర శాస్త్రవేత్తలు చెంగాలమ్మ ఆలయంలో ప్ర్రత్యేక పూజలు చేశారు.