Friday, November 22, 2024

నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C55

సూళ్లూరుపేట(శ్రీహరికోట) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ- సీ55 ని నింగిలోకి పంపింది. ఇస్రో విజయాశ్వంగా పిలుబడే పీఎస్‌ఎల్‌వీ సీరిస్‌లోని 58 రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ -సీ55 ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరు వున్న టెలియోస్‌ -2తో పాటు మరో 16 కిలోల లూమిలైట్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనుంది. అంత్యంత జాగ్రత్తగా పూర్తిస్థాయిలో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేదిశగా శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50గంటలకు ప్రారంభమై.. ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 25.30 గంటల పాటు కొనసాగి ఈరోజు మధ్యాహ్నం 2.19గంట లకు నింగిలోకి ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ -సీ55 రాకెట్‌ తీసుకు వెళ్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement