ఇస్రో విజయాశ్వంగా పిలువబడే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోని పీఎస్‌ఎల్‌వీ -సీ53 నింగిలోకి ఎగిరింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) ఇందుకు వేదికగా నిలిచింది. నిన్న (బుధవారం) సాయంత్రం 4 గంటలకు షార్‌లో ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. 26 గంటల పాటు నిర్విరామంగా ఈ కౌంట్‌డౌన్ ప్రక్రియ కొనసాగింది. కౌంట్‌డౌన్ సమయంలోనే నాలుగు దశల రాకెట్లలో 4, 2 దశల మోటార్లలో ద్రవ ఇంధనాన్ని నింపారు. అనంతరం 1, 3 దశల మోటార్లకు ఘన ఇంధనాన్ని శాస్త్రవేత్తలు నింపారు. ప్రయోగానికి సుమారు 30 నిమిషాల ముందు రాకెట్‌ను సూపర్ కంప్యూటర్ ఆధీనంలోకి తీసుకెళ్లారు శాస్త్రవేత్తలు. సూపర్ కంప్యూటర్ ఆదేశాలతో కౌంట్‌డౌన్ 0కు చేరుకోగానే సాయంత్రం 6 గంటలకు నిప్పులు చిమ్ముతూ… పీఎస్‌ఎల్‌వీ -సీ53 నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్ లో ఇది 55వ ప్రయోగం. సింగపూర్ శాటిలైట్స్ ను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement