సూళ్లూరుపేట, (తిరుపతి) ఆంధ్రప్రభ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పీసీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్‌ను ఈ నెల 5న విజయవంతంగా చేపట్టి యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం చేపట్టిన రోజుల వ్యవధిలోనే పీఎస్‌ఎల్‌వీ సీ-60 ప్రయోగానికి ఇస్రో చకచకా అడుగులు వేస్తోంది.
ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 30వ తేదీ రాత్రి 9.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-60 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం ద్వారా 400 కిలోల బరువు కలిగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు.