నెల్లూరు – భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం రోజు చివరి నిమిషంలో వాయిదా పడిన పిఎస్ఎల్వీ సి-59 రాకెట్ ప్రయోగాన్ని ఇవాళ ప్రయోగించనున్నారు.. కాగా, కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని బుధవారం రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది ఇస్త్రో.. శాటిలైట్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ వెంటనే కౌంట్ డౌన్ ప్రక్రియను నిలిపివేశారు.
ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.. ప్రయోగానికి ముందు అన్ని విభాగాలను కంప్యూటర్ తో పరీక్షలు నిర్వహించారు.. అయితే, ఉపగ్రహంలో లోపం ఉన్నట్లు కంప్యూటర్ గుర్తించింది.. దీనిపై శాస్త్రవేత్తల సమీక్షించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఆ తర్వాత కౌంట్‌డౌన్ ప్రక్రియ నిలిపివేసి.. ప్రయోగాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు..
దీంతో.. ఈరోజు సాయంత్రం 4.12 గంటలకు పిఎస్ఎల్వీ సి-59 రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్త్రో.. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.. శాస్త్రవేత్తలతో సమీక్షిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. కాగా, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైన వేళ.. పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాక్షింస్తూ.. సూళ్లూరుపేటలోని చంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ బుధవారం రోజు పూజలు నిర్వహించిన విషయం విదితమే..
ఈ సందర్భంగా ఇస్రో తదుపరి ప్రాజెక్టులపై మాట్లాడుతూ.. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక,ఈ రాకెట్‌ను కూడా ఈ నెలలోనే ప్రయోగిస్తామని.. చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని.. గగన్‌యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెలలో ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో మొదలవుతాయని ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ ప్రకటించారు.