Friday, November 22, 2024

PSLV-C57: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్ 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట నుండి ఆదిత్య ఎల్ 1 నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉద‌యం 11.50 నిమిషాల‌కు ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌తో రాకెట్ నింగిలోకి వెళ్లింది. లిఫ్ట్ ఆఫ్ నార్మ‌ల్‌గా సాగింది. సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌1 మిష‌న్‌ను ఇస్రో చేపట్టింది. భూమికి 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ వ‌ద్దకు ఆదిత్య వెళ్తోంది. అక్కడి చేరేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి దాదాపు 125 రోజుల సమయం పడుతుంది. అక్క‌డ నుంచి సూర్యుడిని ఆ స్పేస్‌క్రాఫ్ట్ స్ట‌డీ చేయ‌నున్న‌ది. చంద్రయాన్‌-3 విజయం ఇచ్చిన జోష్‌తో భారత అంతరిక్ష సంస్థ సూర్యుడి సమీపంలో పరిశోధనలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకోసం ఆదిత్య-ఎల్‌1ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది.

సూర్యుడి గురించి మరింతగా అర్థం చేసుకునేందుకు, దాని నుంచి ఎదురయ్యే ముప్పులను పసిగట్టేందుకు ఆదిత్య-ఎల్‌1 వంటి ప్రయోగాలు ఉపకరిస్తాయి. భూమిపై ఉన్న ప్రతిఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారు. ఎలక్ట్రిక్ గ్రిడ్‌, ఇంటర్నెట్‌ గ్రిడ్‌, రోదసిలోని ఉపగ్రహాలు, వ్యోమనౌకలను సమర్థంగా రక్షించుకోవడానికి ఈ ప్రయోగం కీలకం కానుంది. ఈ భూమండలంపై సూర్యుడి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి దోహదం చేస్తుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement