Wednesday, December 4, 2024

Supreme Court : జగన్ అక్రమాస్తుల కేసుల వివరాలు అందించండి

సిబిఐ, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసుల వివ‌రాల‌పై ఆరా
రెండు వారాల‌లో మొత్తం వివ‌రాల‌ను ఇవ్వాల‌ని ఆదేశం

న్యూ ఢిల్లీ – మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో సుప్రీంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారించింది. ఈ సంద‌ర్భంగా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తులపై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. కేసుల పూర్తి వివరాలు 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని చెప్పింది. సీబీఐ,ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలంది. అనంత‌ర ఈ విచార‌ణ‌ను రెండు వారాలు వాయిదా వేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement