Wednesday, November 20, 2024

AP | కాఫీ రైతులకు గిట్టుబాటు ధర అందించండి.. కలెక్టర్ దినేష్ కుమార్

పాడేరు, అక్టోబరు 23: అరకు కాఫీకి గిట్టుబాటు ధర అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ సూచించారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఐటిసి కంపెనీ అధికారులు, కాఫీ అధికారులతో కాఫీ విక్రయాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అరకు కాఫీని గిరిజన రైతులు ఆర్గానిక్ విధానంలో సాగు చేస్తున్నారని కాఫీ రైతులకు మంచి ధర చెల్లించాలని స్పష్టం చేశారు. చింతపల్లి మాక్స్ సంస్థ సేకరిస్తున్న కాఫీని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామన్నారు.

కాఫీ సేకరణలో తగిన నాణ్యతలు పాటించాలని సూచించారు. కాఫీ రైతుకు జియో ట్యాగింగ్ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాఫీ నాణ్యతలపై లైజాన్ వర్కర్లకు అవగాహన కల్పించాలన్నారు. చింతపల్లి మాక్స్ సంస్థ ఈ ఏడాది 600టన్నుల పార్చిమెంట్ కాఫీని ఉత్పత్తి చేస్తోందన్నారు. గిరిజన కాఫీని బహిరంగ వేలంలో విక్రయిస్తామన్నారు. గత రెండు సంవత్సరాలను అరకు కాఫీ ఫైన్ కప్ అవార్డును పొందుతోందన్నారు.

ఐటీసీ అధికారులు వాసుదేవ మూర్తి, కిరీట్ పాండే మాట్లాడుతూ… మాక్స్ కాఫీ వేలంలో పాల్గొంటామని చెప్పారు. కాఫీ విక్రయాలు, వేలం సమయంలో సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో కాఫీ బోర్డు డి.డి.ఎస్.రమేష్, ఐటీడీఏ కాఫీ సహాయ సంచాలకులు ఎన్.అశోక్, ఐటీడీఏ ఎం.హేమలత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement