వెయ్యి కోట్ల ఆరోపణలపై షర్మిల గరం గరం
జగన్ వేసే బిస్కెట్లకు ఆశ పడి ఆరోపణలన్న పిసిపి చీఫ్
ఇలా అన్నందుకు మీకు ఎంత ముట్టిదంటూ కౌంటర్
వైఎస్ ఆర్ ను హత్య చేసింది రిలయన్స్ అంటూ
వారికే ఎంపి టిక్కెట్ ఇచ్చిన జగన్
జగన్ పక్కన అందరూ ఊసరవెల్లులే
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాను బరిలో ఉన్న కడప లోక్ సభ స్థానంలో ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. తన సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు.. కాగా,. తాను జగన్‌ను వెయ్యి కోట్ల విలువైన పని కావాలని అడిగానని ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి తాను ఏ పని కావాలని అడగలేదని స్పష్టం చేశారు.
జగన్ వేసే బిస్కెట్లకు ఆశ పడి..
‘రూ. వెయ్యి కోట్ల పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడే వాళ్ళు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడే వారే. ఇలా మాట్లాడితే మీకు ఎంత అందుతుందో చెప్పండి ? రూ.వెయ్యి కోట్లు కాదు రూ. 10 వేల కోట్ల వర్క్ అడిగానని కూడా చెబుతారు. జగన్‌ను ఒక్క పైసా సహాయం అడగలేదు. అలా అని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. జగన్ పక్కన ఉండే వాళ్లు ఊసరవెల్లులు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక పుట్టుకనే అనుమానిస్తారు. తన తల్లి విజయమ్మపై నిందలు వేశారు. ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని జగన్ అన్నారు. అంతా నమ్మారు, ఆ సంస్థపై దాడులు చేశారు. కేసులో ఇరుక్కున్నారు. జగన్ సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వారికి ఎంపి ఇచ్చారు అని’ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గొడ్డళ్లు పట్టుకునే వాళ్ల కాదు ..
‘వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత జగన్ సీబీఐ విచారణ అడిగారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విచారణ వద్దన్నారు. అప్పుడొ మాట, ఇప్పుడొ మాట మాట్లాడారు. వైఎస్ఆర్ పేరుని సీబీఐ చార్జ్ షీట్‌లో పెట్టించారు. పొన్నవోలుకి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. సొంత తండ్రి పేరు సీబీఐ ఛార్జ్ షీట్‌లో చేర్పించారు. నా భర్త అనిల్ పై అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి మాదిరిగా మద్య రాత్రి గొడ్డలితో వెళ్ళడం మాకు చేతకాదు. అనిల్‌ను కలవలేదు. ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఆయనకు లేదు అని’ షర్మిల స్పష్టం చేశారు.
కంటికి కనిపించని పొత్తును జగన్ కొనసాగిస్తున్నారని.. క్రైస్తవులపై దాడి ఘటనలో కూడా వైసీపీ స్పందించలేదని షర్మిల అన్నారు. రూ.వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పైనా షర్మిల స్పందిస్తూ.. తన భర్త అనిల్ కుమార్ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదు.. కలవరని స్పష్టం చేశారు. అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఆరోపించారు. .. వివేకా హత్య కేసును మరోసారి ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో జగన్ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని .. అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.