Saturday, November 23, 2024

Protests – ఎక్క‌డిక‌క్క‌డ టిడిపి నేత‌ల అరెస్ట్….ప‌లు జిల్లాల‌లో ఉద్రిక్త‌త‌…

అమ‌రావ‌తి – టిడిపి నేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ నేప‌థ్యంలో ఎపి అంత‌టా టిడిపి శ్రేణులు నిర‌స‌న‌ల‌కు దిగారు.. ప‌లు జిల్ల‌లాలో బంద్ కు పిలుపు ఇచ్చారు.. అనేక ప్రాంతాల‌లో పోలీసుల‌కు, కార్యక‌ర్త‌ల‌కు వాగ్వాదం చోటు చేసుకున్నాయి.. దీంతో పోలీసులు టిడిపి నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేస్తున్నారు.. ముఖ్య నేత‌ల‌ను గృహ నిర్భందంలో ఉంచారు..

టిడిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని టిడిపి ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి జిల్లాలోని బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో పాటు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి,నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి,ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిలతోపాటు మరింత మంది టిడిపి నాయకులను అదుపులోకి తీసుకొని బండి ఆత్మకూరు స్టేషన్లో ఉంచారు

క‌డ‌ప‌లో భైఠాయింపు …

కడప ఎన్ టి ఆర్ సర్కిల్ లో టిడిపి అధినేత చంద్రబాబు గారి అరెస్టును నిరసిస్తూ ధర్నా నిర్వహిస్తున్న టిడిపి నేతలను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

- Advertisement -

అనంత‌లో ప్ర‌భాక‌ర్ చౌద‌రి అరెస్ట్ …
అనంతపురం అర్బన్ ఇంచార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ని అరెస్టు చేసి 3 టౌన్ స్టేషన్ కు త‌ర‌లించారు.

కృష్ణా జిల్లా బంద్ కు పిలుపు ఇచ్చిన టిడిపి

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసు బలగాలు మోహరించాయి. జిల్లాలోని ప్రధాన ప్రాంతాలలో పోలీస్ బలగాలను దించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు బలగాలు ఏర్పాటు చేశారు. రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఎక్కడికక్కడే బంద్ కు తెదేపా నాయకులు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement