అమరావతి – టిడిపి అధినేత చంద్రబాబు పైన పెట్టిన తప్పుడు కేసులకు భయపడేదే లేదని, ప్రజాగ్రహాన్ని రుచి చూపిద్దామని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ, చంద్రబాబుకి సంఘీభావంగా వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. బాబుకి మద్దతుగా తెలుగువారంతా ఉన్నారని నిరూపించే తరుణం వచ్చిందని అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన సరిగ్గా 7 గంటలకు తెలుగు ప్రజలంతా మోత మోగించాలన్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే 5 నిమిషాల పాటు శబ్ధం చేయాలన్నారు టీడీపీ నేత నారా లోకేష్. శబ్ధం చేసేందుకు గంట, పళ్లాలు, విజిల్స్, హార్న్ లాంటివి వాడాలని.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చెయ్యాలన్నారు లోకేష్.
ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది…నారా బ్రహ్మణి
పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి. చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి.. అంటూ నారా బ్రహ్మణ్ ట్విట్ చేశారు.