పలమనేరు – తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినం సందర్భంగా సోమవారం సాయంత్రం పలమనేరు టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకో జగన్ అనే చెడుపై… మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయం అనే నినాదంతో సైకో పోవాలి
అనే పత్రాలను దహనం చేసి నిరసన తెలియజేసారు. ఈ సందర్బంగా స్థానిక పార్టీ కార్యాలయము నుంచిపట్టణం లోని బజారు వీధి మీదుగా రెక్కమాను సర్కిల్ వరకు శాంతియుత ర్యాలీ చేపట్టిన నాయకులను పోలీసుల అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులకు పోలిసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక పరిస్థితి నెలకొంది. తమ శాంతియుత నిరసనను అడ్డుకోవడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతలకు తమ నిరసన వ్యక్తం చేసుకునే హక్కు కూడా లేదా అంటూ నిలదీ శారు.
అనంతరం పోలీసులు నిలువరించడంతో అక్కడినుంచి పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని సైకో పోవాలి అనే పత్రాలను దగ్ధం చేసి ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా ఖండించారు. అంతకు ముందు పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజులు వైకాపా ప్రభుత్వ నిరంకుశ పాలనపై విమర్శలు చేయడంతో పాటు పుంగనూరు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గంగవరం నాయకులు పాల్గొన్నారు.
.