రేపు విజయవాడ ధర్నా చౌక్ లో దీక్ష చేయనున్నట్లు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… జిల్లాల పునర్విభజనలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని, సొంత పార్టీ వ్యవహారంలా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు, ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారన్నారు. ప్రజల మనోభావాలను జగన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
క్నోయా వ్యవహారం చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారన్నారు. దీని దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లాల ఏర్పాటు తీసుకొచ్చారన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే జిల్లాలకు పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తూర్పు కృష్ణకు ఎన్టీఆర్, విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని అడిగినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రేపు విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్ష చేయనున్నట్లు చెప్పారు. అవరసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధమవుతామని బోండా ఉమ హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..