అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పలువురు క్లినికల్, నాన్ క్లినికల్ ప్రొఫేసర్లకు పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(వైద్య, ఆరోగ్యశాఖ) ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఏడీఎంఈ) హోదాలో పలువురు క్లినికల్, నాన్ క్లినికల్ ప్రొఫేసర్లకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్స్, టీచింగ్ ఆసుపత్రులకు సూపరిండెంట్లుగా పదోన్నతి కల్పించారు.
వీరిలో డాక్టర్ పీ.వెంకట బుద్ధా, డాక్టర్ కే.సత్యవర ప్రసాద్, డాక్టర్ బీ.సౌభాగ్యలక్ష్మి, డాక్టర్ సీ.పద్మావతి, డాక్టర్ వీ.మురళీ కృష్ణ, డాక్టర్ ఎం.భగవాన్ నాయక్, డాక్టర్ సీఎస్ఎస్ శర్మ, డాక్టర్ జీ.నాగేంద్రనాధ్ రెడ్డి, డాక్టర్ పీ.వెంకట రమణ, డాక్టర్ పీ.ఏ చంద్రశేఖరన్, డాక్టర్ ఏ.స్వామినాయుడు, డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహన్, డాక్టర్ జీఎస్ రమేష్ కుమార్, డాక్టర్ సీ.రవి వెంకటాచలం, డాక్టర్ బీ.మురళీ కృష్ణ, డాక్టర్ పీవీ సుధాకర్ , డాక్టర్ వీ.రేవతి, డాక్టర్ ఎం.నీరజ, డాక్టర్ పీ.సుధాకర్, డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కే.సుధాకర్ ఉన్నారు.
ఆరుగురికి ఏడీఎంఈ పదోన్నతి..
ఆరుగురు ప్రొఫేసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతి కల్పించారు. డాక్టర్ బీ.శంకర శర్మ, డాక్టర్ టీ.నాగమణి, డాక్టర్ వై.నాగేశ్వరరావు, డాక్టర్ ఎం.మార్కండేయులు, డాక్టర్ జీ.రఘునాధ బాబు, డాక్టర్ పీవీ రాఘవరావు పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...