Friday, November 22, 2024

మ్యాపింగ్‌ పూర్తయితే టీచర్లకు పదోన్నతులు.. జూన్‌ నెలాఖరులోగా చేసేందుకు కసరత్తు..

విద్యాశాఖలో భారీ సంస్కరణలకు అడుగులు పడుతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలల వరకు మ్యాపింగ్‌ ప్రక్రియ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాపింగ్‌ పూర్తయితే పెద్ద ఎత్తున పదోన్నతులకు లైన్‌ క్లియర్‌ కానుంది. విద్యాశాఖపై ఇటీవల ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ప్రమోషన్లు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మధ్య దూరం, మౌలిక సదుపా యాలు, ఇతర అంశాలపై మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో పర్యవేక్షణా ధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో మండల విద్యాశాఖాధి కారి రెండేసి మండలాలలో పాఠశాలల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. పదోన్నతులలో భాగంగా ఎంఈవో పోస్టుల్లోనూ భారీగా నియామకాలు జరగనున్నాయి. అలాగే డీవైఈవో పోస్టులనూ భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేసవి సెలవుల అనంతరం విద్యా సంస్థలు తిరిగి తెరుచుకు నేలోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

800కు పైగా కొత్త జూనియర్‌ కళాశాలలు.

రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తగా 800కు పైగా కొత్త జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 672 మండలాలు ఉన్నాయి. వీటిలో 41 మండలాలలో మహిళా కళాశాలలు ఉన్నాయి. 202 మండలాలలో అసలు జూనియర్‌ కళాశాలలే లేనట్లు గుర్తించారు. తాజా ప్రతిపాదనలతో మహిళలకు ప్రత్యేకంగా కళాశా లలతోపాటు 833 వరకు కొత్త జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చెరర్‌ స్థాయి పదోన్న తులు, గెజిటెడ్‌ ప్రధానోపా ధ్యాయులకు ప్రిన్సిపాల్‌ స్థాయి పదోన్నతులు లభించనున్నాయి.

పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి..

రాష్ట్రంలో ప్రస్తుతం మండల విద్యాశాఖ అధికారులకు విద్యారంగ పర్యవేక్షణ బాధ్యతలతో పాటు మండల స్థాయిలో ఇతర శాఖలు, వ్యవహారా లకు సంబం ధించిన పనుల భారం పెరుగుతోంది. మరోవైపు డీవైఈవో, ఎంఈవో పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్క అధికారి ఇన్‌చార్జిగా అదనపు మండలాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. అయితే ఈ భారాన్ని తగ్గించడంతోపాటు, కేవలం విద్యాశాఖ బాధ్యతలే అప్పగించేలా సెల్ఫ్‌ డ్రాయింగ్‌ అధికారాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సుదీర్ఘ కాలంగా ఎంఈవోల ఆకాంక్ష అయిన మండల వనరుల కేంద్రం పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చే ప్రతిపాదన అమలు కానుంది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు రానున్నాయి.

- Advertisement -

25 వేలకు పోస్టుల్లో పదోన్నతులు ..

రాష్ట్రంలో మూడో తరగతి నుంచి ఉన్నత పాఠశాలల వరకు మ్యాపింగ్‌ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో సెకండరీ గ్రే డ్‌ టీచర్లకు స్కూల్‌ అసి స్టెంట్లుగా పదోన్నతులు జరగనున్నాయి. ఈ ఏడాది జూన్‌ నెలాఖరులోగా ఈ ప్రక్రి యను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో దాదాపు 25 వేలకు పైగా ఎస్జీటీలు స్కూల్‌ అసిస్టంట్లు-గా పదోన్నతులు పొందనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement