విశాఖ పట్నం, (ప్రభన్యూస్ బ్యూరో) : ఏపీలో 11 మంది మునిసిపల్ కమిషనర్లకు పదోన్నతి లభించింది. జీవీఎంసీలో ముగ్గురికి చాన్స్ దక్కింది. పురపాలకశాఖలో పనిచేస్తున్న ఐదుగురు స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్లను, సెలక్షన్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు జీఓఆర్ టి నంబర్ 661ను ప్రభుత్వం జారీ చేసింది. అలాగే ఆరుగురు ఫస్ట్ గ్రేడ్ మునిసిపల్ కమిషర్లను, స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ జీఓ ఆర్ టి నంబర్ 662 తో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు మునిసిపల్ కమిషనర్లు పదోన్నతి పొందారు. అందులో స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్ హోదాలో కార్యదర్శిగా పనిచేస్తున్న పల్లి నల్లనయ్యను సెలక్షన్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్ గా పదోన్నతి పొందారు. కాగా, గ్రేటర్ కార్యదర్శి పోస్ట్ లోనే కొనసాగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఫస్ట్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్ హోదాలో జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న బొడ్డేపల్లి రాముని స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్ గా పదోన్నతి కల్పిస్తూ తిరిగి అదే స్థానంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫస్ట్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్ హోదాలో డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సీహెచ్ సత్యనారాయణ ను స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్ గా పదోన్నతి కల్పిస్తూ తిరిగి అదే స్థానంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.