Thursday, November 21, 2024

Daggubati Purandeswari :కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం

ఆరోగ్య శ్రీకి సీఎం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆస్పత్రిలో సేవలు నిలిపి వేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రథాన్ని దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా చేస్తున్నామని కేంద్రం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేస్తామని చెప్పారు. వికసిత్ భారత్ పేరుతో ఏపీలో 50 వ్యాన్ లతో యాత్ర సాగుతుందన్నారు. ప్రజల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇళ్లు రాని వారు ఆ వ్యాన్ దగ్గరకు వెళ్లి అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చన్నారు.కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement