అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు.. బదిలీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చింతూరు యూనిట్-2 పరిధిలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏ సింహాచలంకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదా కల్పించారు. పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న జీ శ్రీనివాసులు ఏఎస్‌ఆర్ జిల్లాలో (ఆర్ అండ్ ఆర్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. యేటపాక యూనిట్-2లో డీసీగా పనిచేస్తున్న జీ నాగేంద్రకు ఎస్‌డీసీగా ప్రమోషన్ ఇచ్చారు.
చింతూరులో కూనవరం యూనిట్-1 డీసీ కే నరసయ్యకు ఎస్‌డీసీగా, యూనిట్-2 డీసీ వై వెంకటేశ్వర్లుకు ఎస్‌డీసీగా, యేటపాక యూనిట్-1లో పనిచేస్తున్న జీ బాలకృష్ణారెడ్డికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. కాగా ఎల్ శివకుమార్‌ను యూనిట్-2 వీఆర్‌పురం ఎస్‌డీసీగా, ఎస్ నరసింహారావును కేఆరర్‌పురం యూనిట్ ఎస్‌డీసీగా ఏలూరుకు, యేటపాక ఆర్ అండ్ ఆర్ ఎస్‌డీసీగా వీ విజయభరత్ రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.