Saturday, November 23, 2024

AP: అప్పుకోసమే తిప్పలు.. ప్రభుత్వంపై విమర్శలు..

కర్నూలు, (ప్రభన్యూస్‌ బ్యూరో): అప్పుల కుప్పలో కూరుకుపోయిన ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల అమలుకు చేయని కసరత్తు అంటూ లేదు అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వినియోగించుకునే ప్రయత్నంలో ఉంది ప్ర‌బుత్వం. ఈ క్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ వద్ద ఉన్న భూములను ఏపీ ఆర్‌డీసీకి ( ఏపీ రోడ్డు డెవల్‌పెంట్‌ కార్పొరేషన్‌కు) బదలాయిస్తూ ఇటీవల జీఓ 46ను జారీ చేసింది ప్ర‌బుత్వం. ఈ జీఓపై కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రోడ్ల భవనాలకు శాఖకు రూ.వేలకోట్ల విలువైన ఆస్థులు ఉండగా, అందులో అధిక భాగం కర్నూలు జిల్లాలో ఉండటమే కార‌నం. వీటిలో చాలా వరకు ప్రస్తుతం ప్రభుత్వం ఏపిఆర్‌డిసికి బదలాయించనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రహదారులను అందంగా తీర్చిదిద్దెందుకు వేలకోట్ల రుణంను తీసుకురమ్మని ఏపీ ఆర్‌డిసికి చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్‌అండ్‌బి ఆస్తులను ఆర్డీసీకీ బదలాయించి వాటిని తాకట్టు పెట్టి భారీ అప్పు తెచ్చేందుకు ప్రణాళిక చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక నంద్యాలలో 0.370 ఎకరాల్లో సబ్‌డివిజన్‌ కార్యాలయం, డిఇఇ క్వార్టర్సు, వాచ్‌మెన్‌ క్వార్టర్‌,0.37 ఎకరాల్లో స్టోర్‌ ఉంది. ఇదే డివిజన్‌లో 0.530 ఎకరాల్లో సెక్షన్‌ ఆఫీసర్సు కార్యాలయం, స్టోర్‌, 0.53 ఎకరాల్లో ఎన్‌జిఓ హోమ్‌ ఉంది. ఇక ఇదే డివిజన్‌లోని 561-బి, 557లో సర్వేనెంబర్‌లో 1.437 ఎకరాల్లో ఆర్‌అండ్‌బి ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా, వీటిలో 1.4366 ఎకరాలు పాతవి, మరియు కొత్తవి కలవు. పాణ్యం పరిదిలో సర్వేనెంబర్‌ 1261 సి, 1262 ఏ, 2.25 ఎకరాలు, నంద్యాల పరిధిలో స్టోర్‌ యాడ్‌, న్యూ ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా పరిదిలో 3.712 ఎకరాలు, ఇదే డివిజన్‌ పరిధిలో సర్వేనెంబర్‌ 555 పరిదిలోని 2.562 ఎకరాల్లో ఇఇ క్వార్టర్స, 0.593 ఎకరాల్లో డివిజన్‌ కార్యాలయం, ఆళ్లగడ్డ పరిదిలో సర్వేనెంబర్‌ 559లో 1.179 ఎకరాలు, చాగలమర్రి పరిదిలో సర్వేనెంబర్‌ 148 పరిదిలో 0.840 ఎకరాలు, నందికొట్కూరు పరిధిలో 0.596 ఎకరాలు, ఇదే డివిజన్‌ పరిధిలో 0.166 ఎకరాలు, ఆత్మకూరు పరిధిలో 0.582 ఎకరాలు, అవుకు పరిధిలో సర్వేనెంబర్‌ 1790-1లో 1.390 ఎకరాలు, బనగాన పల్లే పరిదిలో 2.050 ఎకరాలు, కోవేలకుంట్ల పరిదిలో 0.500 ఎకరాలు

ఇక ఆదోని డివిజన్‌లో 1.60 ఎకరాల్లో ఐబి. డివిజన్‌ కార్యాలయంలు గలవు, ఎమ్మిగన్నూరు పరిదిలో 2.97 ఎకరాల్లో ఐబి, 1.48 ఎకరాల్లో ఐబి, మంత్రాలయం పరిధిలో 1.19 ఎకరాలుండగా, వీటిలో డీఈఈ కార్యాలయం, క్వార్టర్సు, స్టోర్‌ షెడ్‌ కలవు, ఎమ్మిగన్నూరు పరిదిలోనే 0.72 ఎకరాల్లో ఓల్డు డిఇఇ క్వార్టర్సు, ఆదోని పట్టణ పరిధిలోని సబ్‌డివిజన్‌ ఆపీస్‌, స్టోర్‌షెడ్‌, డిఇఇ క్వార్టర్సు కలిపి మొత్తం 13.89 ఎకరాలు గలవు.ప్రస్తుత మార్కెట్‌లో వీటి విలువ రూ.121031.42 లక్షలు చేస్తుందని అంచనా, వీటితో పాటు రూ.5550.17 లక్షల చేసే భవనాలు, క్వార్టర్లు, ప్రభుత్వ అథితి గృహాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో రూ.1,266 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం ఆర్‌డిసికి బదలాయింపు చేసినట్లు సమాచారం.చేయనుండగా, ఇందులో రూ.1,200 కోట్ల విలువ చేసే ఆస్ధులు ఒక్క కర్నూలు జిల్లావే కావడం విశేషం

Advertisement

తాజా వార్తలు

Advertisement