Thursday, November 21, 2024

పేద‌ల వైద్యానికి ప్రాధాన్యం.. మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

గార : ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం శ్రీ కూర్మంలో కొత్త‌గా నిర్మించిన అప్ గ్రేటెడ్ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ ను రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప్రారంభించారు. ఇందుకు రెడ్డీస్ ల్యాబొరేట‌రీ,ఏపీ స‌ర్కారు సంయుక్తంగా 65లక్ష‌ల రూపాయ‌లు వెచ్చించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ,ప్ర‌జా వైద్యానికి సీఎం జగన్ పెద్ద పేట వేస్తున్నారని,. పేద కుటుంబం ఆరోగ్యం కోసం ఆందోళన చెందాల్సిన పని లేకుండా చేశారన్నారు . వైద్యం ప్రజల దగ్గరికే తీసుకు వచ్చామని,ఆరోగ్య శ్రీ తో ఖ‌రీదైన వైద్యాన్ని సైతం ఉచితం చేశామని తెలిపారు.. ఫ్యామిలీ డాక్టర్ తో మీ గుమ్మం దగ్గరకే తీసుకు వచ్చామన్నారు . మీకు అందిస్తున్న ఈ ఆసుపత్రి సద్వినియోగం చేసుకున్న రోజే ప్రయోజనం వస్తుందని తెలిపారు..

రానున్న కాలంలో ప్ర‌భుత్వ వైద్యంపై న‌మ్మ‌కం పెంపొందించుకునే విధంగా అన్ని చ‌ర్య‌లూ చేప‌ట్ట‌నున్నామని,ఇప్ప‌టికే ప‌లు చోట్ల అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామని,రిమ్స్ ను, అలానే టెక్క‌లి జిల్లా ఆస్ప‌త్రిని అప్ గ్రేడ్ చేశామని తెలిపారు . అద‌న‌పు బెడ్ల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేశామని,.విలేజ్ క్లినిక్ ను కూడా నెల‌కొల్పామన్నారు.ఇక్క‌డి అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ కు నిధులు స‌మ‌కూర్చిన రెడ్డీస్ ల్యాబ్ నిర్వాహ‌కుల‌ను అభినందిస్తున్నానన్నారు . ఇప్పటికే జిల్లాలో రెండు చోట్ల అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ల ఏర్పాటు కు తోడ్పాటు అందించారని,మరో రెండు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు . జిల్లా ప్రజల తరుపున ఆ సంస్థ‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో కలెక్టర్ శ్రీ‌కేష్ బి.ల‌త్క‌ర్,,రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ షామిక్,ఇంఛార్జ్ హెల్త్ న్యూట్రీషియ‌న్ శ్రీనివాస్, డైరెక్టర్ కార్పొరేట్ అఫ్ఫైర్స్ రాజు..డీఎం అండ్ హెచ్ఓ బొడ్డేపల్లి మీనాక్షి,ఎంపీపీ గొండు రఘురాం, హెల్త్ ఆఫీసర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement