శ్రీకాకుళం, డిసెంబర్ 20: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రానున్న కాలంలో ఈ ఆలయ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నామని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఇంద్రపుష్కరిణి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంద్రపుష్కరిణిలో స్వచ్ఛమైన నీరు నిరంతరం ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ నిర్మాణపు పనులు మొదలు పెడుతున్నామన్నారు. జూన్, జూలై లోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ శ్రద్ధ వహించి అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని కోరారు. అరవిల్లి దేవాలయానికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారని, దేవాలయం చుట్టూ ఉండే రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉందని.. త్వరలోనే సంబంధిత పనులు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, ఈవో హరి సూర్య ప్రకాష్, ఎమ్మెల్సీలు రఘువర్మ, నర్తు రామారావు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి కుమార్, లుకలాపు గోవిందరావు, జలగడుగుల శ్రీనివాస్, మైలపల్లి లక్ష్మీ, ద్వారపు అనురాధ, జోగి మల్లెమ్మ, దుక్క గన్ని రాజు, నమలిపులి కోటేశ్వర చౌదరి, వాభ లోకేశ్వరి, డాక్టర్ కొంచాడ సోమేశ్వర రావు, స్థానికులు గంగు సీతాపతి, కరమ్ చందు, కోంక్యాన మురళీధర్ రావు, వై. గాయత్రి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.