ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన రద్దయింది. ఈ నెల 29న ఆయన విశాఖపట్నంలో పర్యటించాల్సి ఉండగా.. ఏపీలో తుపాను ముప్పు కారణంగా ప్రధాని పర్యటనను రద్దు చేసినట్లు పీఎంవో ప్రకటించింది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ సంస్థలు చెబుతున్నాయి.