Friday, November 22, 2024

AP | గత ప్రభుత్వం తాగునీరు సరఫరాపై శ్రద్ధ చూపలేదు : డిప్యూటీ సీఎం పవన్‌

గత ప్రభుత్వం గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగు నీరు అంది ఉండేదని… అది కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రంగు మారిన నీరు పంపుల ద్వారా వెళ్ళే పరిస్థితి నెలకొందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత పాలకులు నిర్లక్ష్యపూరిత వ్యవహారాల మూలంగానే డయేరియా లాంటివి ప్రబలాయని అన్నారు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణ తేజ, ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌. ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం వలివర్తిపాడు గ్రామంలో ఉన్న జలాల శాంపిళ్లను చూపించారు. పవన్‌ కళ్యాణ్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఫిల్టర్‌ బెడ్స్‌ నిర్దేశిత సమయంలో మార్చడం, ఇతర ప్రమాణాలను పాటించడంలో ఎక్కడా రాజీపడవద్దని అన్నారు.

ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందుకు నిర్మాణాత్మకంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. గుడివాడ నియోజకవర్గంలో చేసిన విధానాన్ని ఒక మోడల్‌ గా తీసుకోవాలి అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement