Monday, November 25, 2024

Award | ఏపీకి ప్రతిష్టాత్మకమైన జాతీయ వాటర్‌ అవార్డు.. బెస్ట్ స్టేట్ కేట‌గిరీ కింద ఎంపిక‌

అమరావతి,ఆంధ్రప్రభ: జల వనరుల సంరక్షణ శాఖ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్రికి బెస్ట్‌ స్టేట్‌ కేటగిరీ కింద 4వ జాతీయ వాటర్‌ అవార్డులు-2022లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్రికి 3వ ర్యాంకు వచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్‌.జవహర్‌ రెడ్డి బుధవారం వెల్లడించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ,డిపార్టుమెంట్‌ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌,రివర్‌ డెవలప్మెంట్‌ మరియు గంగా రిజువనేషన్‌ ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో 4వ జాతీయ వాటర్‌ అవార్డులు,2022 ను ఇటీవల ప్రకటించడం జరిగింది.

ఈజాతీయ వాటర్‌ అవార్డులు,2022లో వుత్తమ స్టేట్‌ కేటగిరీ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్రికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు (సంయుక్త విన్నర్‌)లభించిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ,డిపార్టుమెంట్‌ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ శాఖ కార్యదర్శి ఫంకజ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్రాసిన లేఖలో తెలియజేశారని సిఎస్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన ఈ జాతీయ వాటర్‌ అవార్డును పొందడం రెండవ సారని జవహర్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జల వనరుల శాఖ మంత్రి ఆదేశాలకు అనుగుణంగా జలవనరుల సంరక్షణ పటిష్ట నిర్వహణకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పలు సంస్కరణలు చేపట్టడమే గాక సాంకేతికతను వినియోగించడం తోపాటు వినూత్న విధానాలను ఒక నిర్ధిష్ట కాలవ్యవధిలో జలవనరుల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా రాష్ట్రం ఈఆవార్డును సాధించడం జరిగిందని సిఎస్‌ చెప్పారు.

జలవనరులను సమర్ధవంతంగా వినియోగించడం, ఉపరితల,భూగర్భ జలవనరుల సామర్ద్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు- అందరి భాగస్వామ్యంతో నీటిపారుదల ప్రాజెక్తులను ప్రోత్సహించడం జరిగిందని పేర్కొన్నారు.అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తిచేయడం ద్వారా త్వరితగతిన ప్రయోజనాలు పొందే లక్ష్యంతో నిరంతర పర్యవేక్షణ మూలంగా ఈఅవార్డును పొందేందుకు అవకాశం కలిగిందన్నారు. ఈ 4వ జాతీయ వాటర్‌ అవార్డులు,2022 గ్రహీతలను త్వరలో జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ట్రోపీ,సైటేషన్లతో సత్కరించడం జరుగుతుందని ఫంకజ్‌ కుమార్‌ తెలియజేశారని సీఎస్‌ జవహర్‌ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement