Saturday, November 23, 2024

ఏపీ అసెంబ్లీకి చేరిన రాష్ట్రపతి ఎన్నికల సామ‌గ్రి..

అమరావతి, ఆంధ్రప్రభ: భారత రాష్ట్రపతి ఎన్నిక ఈ నెల 18న జరుగనున్న నేపథ్యంలో అందుకు సంబందించిన ఎన్నికల సామాగ్రి పటిష్టమైన భద్రత నడుమ మంగళవారం అర్థరాత్రి శాసన సభ భవనానికి సుక్షితంగా చేరాయి. శాసన సభ ప్రాంగణంలో నిరంతర పోలీస్‌ పహారా మధ్య ఈ ఎన్నికల సామాగ్రిని అధికారులు సురక్షితంగా భద్రపర్చారు. భారత ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకు డిల్లీలోని నిర్వచన్‌ సదన్‌ నుండి ఈ ఎన్నికల సామాగ్రిని రాష్ట్రాన్రికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సహాయ ప్రధాన ఎన్నికల అధికారి జె.వి.శ్రీనివాస శాస్త్రి, ప్రెసిడెన్షియల్‌ ఎలక్షన్‌ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కె.రాజకుమార్‌, ఇతర సిబ్బందిని రాష్ట్ర అధికారులు డిల్లీకి పంపారు.

వీరు భారత ఎన్నికల సంఘం నుండి ఈ ఎన్నికల సామాగ్రిని తీసుకుని ఎయిర్‌ ఇండియా విమానంలో మంగళవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ థియో ఫిలాస్‌ నేతృత్వంలో పటిష్టమైన పోలీస్‌ భద్రత మధ్య గన్నవరం విమానాశ్రయం నుండి శాస సభా భవనానికి ఈ ఎన్నికల సామాగ్రిని అధికారులు చేర్చి శాని-టైజ్‌ చేసి భద్రపర్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement