Wednesday, November 20, 2024

Delhi | ఇద్దరు తెలంగాణ ఐపీఎస్ అధికారులకు ప్రెసిడెంట్ మెడల్స్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవలు అందించిన పోలీసు, కేంద్ర పారామిలటరీ, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,132 మంది గ్యాలంట్రీ, సర్వీస్ మెడల్స్, ప్రెసిడెంట్ మెడల్స్‌కు ఎంపికయ్యారు.

ఉత్తమ ప్రతిభా కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది పోలీసులకు పురస్కారాలు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 6 గ్యాలంట్రీ అవార్డులు, 2 రాష్ట్రపతి అవార్డులు, 12 ఉత్తమ ప్రతిభా అవార్డులు దక్కాయి.

ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (PSM) విభాగంలో.. తెలంగాణ రాష్ట్రం నుంచి అదనపు డీజీ ర్యాంకులో ఉన్న దేవంద్ర సింగ్ చౌహాన్, సౌమ్యా మిశ్రాలు పురస్కారానికి ఎంపికయ్యారు. మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, తెలంగాణ నుంచి 12 మంది వివిధ ర్యాంకుల అధికారులు ఎంపికయ్యారు.

గ్యాలంట్రీ మెడల్స్ జాబితాలో తెలంగాణ నుంచి..

  1. వి. శ్రీనివాస్ (కానిస్టేబుల్)
  2. ఎన్. హరీశ్ (కానిస్టేబుల్)
  3. గడ్డిపోగుల అంజయ్య (ఆర్ఎస్సై)
  4. బూర్క సునీల్ కుమార్ (కానిస్టేబుల్)
  5. ఎండీ ఆయూబ్ (కానిస్టేబుల్)
  6. పి. సతీశ్ (కానిస్టేబుల్)
Advertisement

తాజా వార్తలు

Advertisement