భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విశాఖ పర్యటనలో ఉన్నారు. విశాఖ లో జరుగుతున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఈరోజు INS సుమిత్ర నౌకలో ఆయన ప్రయాణిస్తూ.. ప్లీట్ రివ్యూ నిర్వహించారు. రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందు, వెనుకా పైలెట్ వాహనాలు నౌకాలు ప్రయాణించాయి. యుద్ధ నౌకలు రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. అంతేగాకుండా ఆకాశంలో ఎయిర్ క్రాఫ్టులు కూడా సెల్యూట్ చేస్తూ… విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాల్లో మొత్తం 10 వేల మందికి పైగా నేవీ సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖలో ఈ నెల 21 నుంచి మార్చి 4 వరకు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి దేశ, విదేశాల నుంచి వందలాది మంది హాజరుకానున్నారు. ప్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ఆదివారం ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ప్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈసారి రివ్యూ చేస్తున్నారు. నౌకదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు, జాతీయ ఓషణోగ్రఫీకి చెందిన నౌకలు పాల్గొంటున్నాయి. జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇందులో పాల్గొంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital