రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాదర్ రానున్నారు. శీతాకాల విడిదికి నేటి నుంచి ఈ నెల 21 వరకు ఉండనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లుగా షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.
రేపు ఉదయం 11.30 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకని ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ నెల 18న సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నెల 20న సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ లోని కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర ప్రముఖులు, విద్యావేత్తలు తదితరులకు ఎట్ హోమ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.