Tuesday, November 26, 2024

ఏపీలో రెండ్రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రపతి ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అంతకుముందు ఆమె రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ప్రస్తుతం ఆమె పర్యటన వివరాలను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 4, 5 తేదీల్లో రాష్ట్రపతి ఏపీలో పర్యటించనున్నారని తెలిపారు. ఈ రెండ్రోజుల పాట రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement