- దావోస్ పర్యటనపై సీఎం చంద్రబాబు ట్వీట్
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన నిమిత్తం దావోస్ బయల్దేరారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రేపు ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన బృందం పాల్గొననున్నారు.
ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం… రాత్రి 1.30 గంటలకు జ్యూరిచ్ వెళ్లనుంది.
కాగా, రేపు ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం బృందం హాజరుకానుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు…
‘‘ప్రపంచ పెట్టుబడుల మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ చేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. నేను స్విట్జర్లాండ్‌లోని దావోస్-క్లోస్టర్స్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సమావేశానికి GoAP నుండి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నాను.” అని పేర్కొన్నారు.