అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెలలో జరిగే ఇంటర్ పరీక్షలకు హాల్ టిక్కెట్లు సిద్ధంగా ఉన్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. ఇప్పటికే కాలేజీ లాగిన్స్‌లో హాల్ టిక్కెట్లు ఉన్నందున తమ తమ కాలేజీల్లో విద్యార్థులు వెంటనే హాల్ టిక్కెట్లు పొందాలని సూచించారు. అకారణంగా హాల్ టిక్కెట్ నిరాకరించే కాలేజీ ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. హాల్ టిక్కెట్లు పొందడంలో సమస్యలు ఉత్పన్నమైన పక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య టోల్‌ఫ్రీ నంబర్ 1800 274 9868, లాండ్‌లైన్ ఫోన్ నంబర్ 08645-277705లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
హాల్ టిక్కెట్లు సిద్ధం, తీసుకోండి.. విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచన
Advertisement
తాజా వార్తలు
Advertisement