Sunday, November 3, 2024

AP | వరద నష్టంపై ప్రాథమిక నివేదిక సిద్ధం…

ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. విపత్తు కారణంగా మొత్తం రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది. శాఖల వారీగా నష్టం అంచనాలను అధికారులు వెల్లడించారు. ఆర్అండ్‌బీకి రూ.2164.5 కోట్లు, నీటి వనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూ రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయశాఖకు రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ సరఫరాకు రూ.75.5 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.39.9 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement