తన తండ్రి 75వ జయంతి సందర్భంగా తన సొంత వూరు నీకంఠాపురంలో ఉన్న ఎల్ వి ప్రసాద్ కంటి హాస్పటల్ కి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ.50 లక్షలు విరాళమిచ్చారు.కాగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి సొంత ఊరు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి రఘువీరారెడ్డి సోదరుడు డాక్టర్ జయరాం, వదిన డాక్టర్ శాంతమ్మ రూ.కోటి విరాళం అందజేశారు.కాగా రఘువీరారెడ్డి మరో సోదరుడు చలువమూర్తి కంటి ఆస్పత్రి కోసం 3 ఎకరాల భూమిని ఇస్తామని ప్రకటించారు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ,ఆసుపత్రి నిర్మాణానికి తోడ్పాటును అందించిన వారందరికి.. మరీ ముఖ్యంగా అత్యంత ఔదార్యాన్ని చూపిన తన అన్న, వదినలు డాక్టర్ శాంత, డాక్టర్ జయరామ్‌కు.. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి తమ ఊరి ప్రజలందరి తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రఘువీరారెడ్డి. మనిషికి కంటి చూపు ప్రధానమని.. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రివారు దాతల సహకారంతో తమ స్వగ్రామంలో కంటి ఆస్పత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగు వ్యక్తి.. రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి చనిపోగా.. నీలకంఠాపురంలోనే ఖననం చేశారు. KGF 2 విడుదల రోజున ప్రశాంత్ సొంత ఊరికి వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు.
Prashanth Neel : సొంతవూరులోని ఎల్ వి ప్రసాద్ హాస్పటల్ కి .. రూ.50లక్షల విరాళం
Advertisement
తాజా వార్తలు
Advertisement