సిఎం జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అనేక విషయాలలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు మంత్రి బొత్స సత్యానారాయణ. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎపిలో జగన్ ఈ సారి ఓడిపోవడం ఖాయమంటూ చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు.
విశాఖపట్నంలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నారని అన్నారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు బొత్స హితవు పలికారు.
కాగా, ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ . లీడర్‌కు, ప్రొవైడర్‌కు కూడా తేడా తెలియదా అంటూ పీకేను ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ లీడర్ అని , చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్ అని అన్నారు.. బీహార్ నుంచి ప్రశాంత్ ని తరిమికొట్టారని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చి ఇష్టమచ్చినట్లు మాట్లాడవద్దంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు . గతంలో ఐదేళ్లపాటు తమ దగ్గర కూడా పనిచేశారని.. ఆయన ఆలోచనలు తీసుకొని ఉంటే.. తాము మునిగిపోయే వాళ్లమని అన్నారు. అందుకే రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. తమ నాయకుల దగ్గర ప్రశాంత్ డబ్బులు కూడా తీసుకున్నారని.. ఇక్కడ మేనేజ్‌మెంట్ తప్ప అతను చేసింది ఏమీ లేదని చెప్పారు.