తర్లుపాడు : 60 సం.ల పైబడిన వారందరూ తప్పక కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యాధికారి డా. కె. వంశీకృష్ణ పేర్కొన్నారు. వైద్యాధికారి కె.వంశీకృష్ణ కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజలకు ఉన్న అపోహలను పొగొట్టేందుకు స్వయంగా ఇంటింటికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్‌ను వేశారు. ప్రజలలో ఉన్న అపోహలు తీరేలా అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట తర్లుపాడు పిహెచ్‌సి పరిధిలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్‌ను ప్రారంభించినపుడు తక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ నమోదయ్యేదని సచివాలయ స్థాయిలో వ్యాక్సిన్ వేయడం ప్రారంభించాక ప్రజలు కలిగియున్న అనుమానాలు నివృత్తి చేస్తున్నామన్నారు. 45-59 సం.ల మధ్య వయసు కలిగి బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, 60 సం. పై వారు తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎమ్ రాధాదేవి, మహిళా పోలీస్ మౌనిక, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement