Tuesday, November 26, 2024

ప్రకాశం జిల్లాలో ప్రపంచంలోనే అతి బుల్లి జింక..!

మూషిక జింక – ఇది ప్రపంచంలోనే అతి బుల్లి జింక. గుండ్రని దేహం.. చిన్న చిన్న కాళ్లతో 25-30 సెం.మీ. పొడవు, 10 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. గడ్డిపరకలు, ఆకులు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. నెమరు వేసుకునే జీవుల్లో పొట్టలో 3 గదులుండే జీవి ఇదొక్కటే. వీటికి కొమ్ములు ఉండవు. ఇవి చిన్న జీవులు. నల్లమలలో వీటి సంచారం ఎక్కువగా ఉందని, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement