Sunday, November 17, 2024

200మందిపై దాడి చేసిన కోతి క‌థ సుఖాంతం

గిద్దలూరు: గిద్దలూరులో గత కొద్ది రోజులుగా బీభత్సం సృష్టించిన మతిస్థిమితం లేని కోతి కథ సుఖాంతమైంది. గిద్దలూరు పట్టణంలో దాదాపు 200 మందిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన మతిస్థిమితం లేని కోతిని ఎట్టకేలకు స్థానికులు పట్టుకొని బంధించారు. గిద్దలూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ 4వ లైన్ లో ఓ ఇంటిలో చొరబడిన కోతిని ఇంటి యజమానులు బంధించి స్థానిక అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నగర పంచాయతీ శానిటరీ ఇన్ స్పెక్ట‌ర్ షేక్ నాయబ్ రసూల్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోతిని బంధించేందుకు చర్యలు తీసుకొని ఎట్టకేలకు మతిస్థిమితం లేని కోతిని బంధించారు. మతిస్థిమితం లేని కోతిని పట్టుకున్న నగర పంచాయతీ అధికారులు సురక్షితంగా తీసుకువెళ్లి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశారు. గత కొద్దిరోజులుగా గిద్దలూరు ప్రజలను, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మతిస్థిమితం లేని కోతి కథ సుఖాంతం కావడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కోతి బెడదను వదిలించిన అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు. కోతి చేష్టాలపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement