కొండేపి మండలం మిట్టపాలెంలోని కాలనీలో దళితులు ఏర్పాటు చేసిన జాతీయ నాయకుడు డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి రెవెన్యూ అధికారులు,పోలీసు అధికారులు తమ సిబ్బంది రావడంతో దళితులు అధికారులు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెసిబి ని దళితులు అడ్డగించడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఈ విషయమై స్థానిక తహశీల్దార్,కామేశ్వర రావు.ఎస్సై రాంబాబు వివరణ ఇస్తూ డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలం ప్రభుత్వ భూమి అని, కానీ అదే కాలనీకి చెందిన మైనం నాగభూషణం విగ్రహం తమ ఇంటికి అడ్డుగా ఉందని,అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని 2019లో హైకోర్టులో కేసు వేసి తొలగింపు ఆర్డర్ ను పొందారన్నారు.. ఆ తీర్పును అమలు చేసేందుకు వెళ్లామని, అయితే స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కి వచ్చి వేశామని చెప్పారు..ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్.ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తెలిపారు.
అంబేద్కర్ విగ్రహం జోలికొస్తే సహిచబోం…
Advertisement
తాజా వార్తలు
Advertisement